E-PAPER

గౌతంపూర్ గ్రామపంచాయతీలో ఓటు హక్కు వినియోగించిన అంతోటి నాగేశ్వరరావు

వై7 న్యూస్ | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన ఓటు హక్కును గౌరవిస్తూ, తెలంగాణలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గౌతంపూర్ గ్రామపంచాయతీలో అంతోటి నాగేశ్వరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారని గుర్తు చేశారు. ఇంగ్లాండ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బడుగు, బలహీన వర్గాల తరపున గట్టిగా వాదించి, సార్వత్రిక ఓటు హక్కును సాధించారని తెలిపారు. చదువుకున్నవారికే ఓటు హక్కు ఇవ్వాలన్న వాదనలను అడ్డుకొని, ప్రతి భారతీయుడికీ సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌దేనన్నారు.

తన వ్యక్తిగత విషాద సమయంలో కూడా సమావేశాన్ని వదలకుండా, దేశ భవిష్యత్తు కోసం పోరాడిన త్యాగమూర్తి అంబేద్కర్ గారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలంతా భయమూ, ప్రలోభాలూ లేకుండా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News