వై 7 న్యూస్ పలాస
శనివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 25 వినతులు అందాయి.
ఈ వినతుల్లో ఇండ్ల స్థలాలు, ఇల్లు మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, స్పౌస్ పెన్షన్లు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, మురికి కాలువల ఏర్పాటు, జీరో ఎక్స్టెంట్ పాసుబుక్కుల మంజూరు వంటి వివిధ సమస్యలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొన్ని సమస్యలపై అక్కడికక్కడే చరవాణి ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారం చేయించారు. మిగిలిన వినతులను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
Post Views: 121









