వై 7 న్యూస్ పినపాక
బట్టా విజయ్ గాంధీ, మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఉప్పుసాక పంచాయతీ నూతన సర్పంచ్ వర్స. మంగమ్మతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఘన విజయం సాధించిన ప్రజాప్రతినిధులు మంగళవారం మణుగూరులోని ఎమ్మెల్యే గృహంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల నమ్మకానికి తగిన విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే ప్రజాసేవలో నిబద్ధతతో పని చేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పుసాక పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.









