E-PAPER

12 కేజీల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా కంచిలీ రైల్వే స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణాకు పోలీసులు చెక్ పెట్టారు.
కంచిలీ నుంచి ముంబై వెళ్లేందుకు రైలు కోసం ప్లాట్‌ఫాం పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు గమనించి కంచిలీ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వారిని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 12 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ గంజాయిని ముంబైకి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సోంపేట సీఐ మంగరాజు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News