మణుగూరు:
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పినపాక నియోజకవర్గంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు సేవాలాల్ సేన మణుగూరు మండల అధ్యక్షులు రవి నాయక్ (గోల్డ్) తెలిపారు.
పత్రికారంగం సమాజానికి అద్దం పట్టే మహత్తరమైన వృత్తి అని, ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని నిజాలను వెలికితీసి సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు తన వందనాలు తెలియజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలానికి పత్రికా స్వేచ్ఛ ఎంతో కీలకమని, జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తిస్తూ వారికి పూర్తి మద్దతు ఉంటుందని రవి నాయక్ తెలిపారు.
జాతీయ పత్రికా దినోత్సవం జర్నలిజం విలువలను మరింతగా గుర్తు చేసే రోజు అని పేర్కొన్నారు.
Post Views: 160









