భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి జాబ్ మేళాకు గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉద్యోగ యువత, యువకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని చెప్పారు.
ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాలను వినియోగించుకొని తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని పసుపులేటి వీరబాబు పిలుపునిచ్చారు.
జాబ్ మేళాకు భారీగా నిరుద్యోగులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
Post Views: 61









