వై 7 న్యూస్ ములుగు
ములుగు జిల్లా మంగపేట మండలంలోని లక్ష్మినర్సాపురం గ్రామంలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని వాలీబాల్ క్రీడలను జిల్లా క్రీడా కన్వీనర్ సొలం సాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన ఈ క్రీడలలో మొత్తం ముప్పై రెండు జట్లు పాల్గొనగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడలను నిర్వహిస్తుంటామని నిర్వాహకులు తెలిపారు.
క్రీడలను ప్రారంభించిన నాయకులు మాట్లాడుతూ గెలుపు ఓటములు ప్రతి ఆటలో సహజమేనని, అయితే గెలుపు కోసం క్రమశిక్షణ, కృషి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఆటను ఆస్వాదిస్తూ పోటీ భావనతో ముందుకు సాగితేనే విజయం సులభమని యువ ఆటగాళ్లకు సూచించారు. బీర్సా ముండా వంటి మహానుభావుల స్వదేశ ప్రేమ, పోరాట స్ఫూర్తి ఈ రోజూ యువతకు ఆదర్శమని చెప్పారు.
కార్యక్రమానికి ఆదివాసీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి మద్దెల అంజయ్య, తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ పోదేం నాగేష్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల సురేష్, ములుగు జిల్లా కార్యదర్శి మద్దెల వెంకటేష్, భారత్ బ్లాక్ జిల్లా కన్వీనర్ కిరణ్ మై, తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి కొమురం పుల్లారావు, ఆదివాసీ గాయకులు,రచయితలు మద్దెల సమ్మక్క, రాజేందర్ తదితరులు హాజరయ్యారు. క్రీడల నిర్వహణలో పిటిలు కొమరం రవి, ఇర్ప శ్రవణ్, కొమరం నిరాజ్, అర్జున్, కొమురం శివాజి తదితరులు కీలక పాత్ర పోషించారు.
భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వాలీబాల్ పోటీలు స్థానిక యువతను ఉత్తేజపరిచాయి.









