E-PAPER

4వ వార్డ్‌లో మహిళల భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

వై 7 న్యూస్ పలాస

కాశీబుగ్గ–పలాస మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం కాలనీలో పాత సచివాలయం భవనం చాలాకాలంగా ఖాళీగా ఉండడం వల్ల సమావేశాల కోసం స్థలం లేక డ్వాక్రా మహిళలు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఈ సమస్యను గుర్తించిన 4వ వార్డ్ ఇన్‌ఛార్జ్ చేలూరు రామకృష్ణ తన స్వంత నిధులతో భవనాన్ని మరమ్మతులు చేసి మళ్లీ వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.

కొత్త రూపంలో సిద్ధమైన ఈ మహిళల సమావేశ భవనాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. మహిళల కోసం సేవలు, సమావేశాలు, కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వార్డ్ ఇన్‌ఛార్జ్ రామకృష్ణ వ్యక్తిగత నిధులతో ప్రజల కోసం ముందడుగు వేయడం ప్రశంసనీయమని ఆమె అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News