సూర్యాపేట : ది ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట పూర్తి స్థాయి కమిటీని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులందరి సమ్మతితో కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించింది.
ఇప్పటికే శుక్రవారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సీనియర్ ఉపాధ్యక్షుల ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ రోజు మిగిలిన పదవులన్నీ కూడా ఏకగ్రీవంగా నింపి పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు ఇలా ఉన్నారు:
అధ్యక్షుడిగా నాయిని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి యాదగిరి, కోశాధికారిగా చర్లపల్లి గిరీష్ కుమార్ ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షుడిగా సుంకరబోయిన వెంకటయ్యను కొనసాగించారు.
గౌరవ అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య, పల్లె మణి బాబు, పొట్టెపాక సైదులు ఎంపికయ్యారు. గౌరవ సలహాదారులుగా మానుకొండ రాము, ధూపాటి శ్యాంబాబు, టేకుల సుధాకర్, గుంటి శ్రీనివాస్, మామిడి రవి, దుస్సా చంద్రశేఖర్‌లను నియమించారు.
ఉపాధ్యక్షులుగా లింగాల సాయి గౌడ్, దుర్గం బాలు, నందిపాటి సైదులు, కొరివి సతీష్ యాదవ్, గుడపూరి ప్రభాకర్ (ప్రభు), దేశ గాని వెంకట్ గౌడ్ ఎన్నికయ్యారు.
సహాయ కార్యదర్శులుగా నజీర్ ఖాన్, యోయో టీవీ శంకర్, దుర్గం సుమన్, బచ్చలకూరి వెంకన్న, కాటం గౌడ్, వల్దాసు శంకర్ బాధ్యతలు చేపట్టారు.
ప్రచార కార్యదర్శులుగా మహమ్మద్ గౌస్, మామిడి సైదయ్య, తాప్సి అనిల్, కొమ్మ గాని సైదులు గౌడ్, చందుపట్ల శ్రీకాంత్, కుంచం రాంబాబు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా యాతాకుల మధుసూదన్, మామిడి వెంకట్, తిరుపతి శ్రీనివాస్, కొండ రవి, అబ్దుల్ అజీజ్ తదితరులను కమిటీ ప్రకటించింది.
కొత్త కమిటీ జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రతినిధులు తెలిపారు.









