E-PAPER

కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను విరమించుకోవాలి – సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

వై 7 న్యూస్, పలాస:
పలాస ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు.

గురువారం పలాసలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “బలవంతపు భూసేకరణతో రైతులను, పేద ప్రజలను నిర్బంధించటం తగదు. ప్రభుత్వం తక్షణమే ఈ అన్యాయ చర్యలను నిలిపివేయాలి,” అని కోరారు.

ఈ సందర్భంగా ఆయన నవంబర్ 18న పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సమావేశంలో కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు లండ వెంకటరావు, కొన్నా శ్రీనివాస్, కొమర వాసు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News