-మన్నె సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయిని భాను ప్రసాద్
-తహశీల్దారు ఆదేశాల మేరకు గ్రామంలో సర్వే చేసిన ఆర్ఐ మేఘన
మెదక్ జిల్లా నార్సింగి వై సెవెన్ న్యూస్ అక్టోబర్ 30
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వేలో భాగంగా అందులో ఎస్సీ కులగణన కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.కాగా నార్సింగి మండలానికి చెందిన శేరిపల్లి గ్రామం నుండి ఎస్సీ మన్నె కులస్థులు కుల ధృవీకరణ పత్రం గురించి ఆర్జీ పెట్టగా మండల తహశీల్దార్ ప్రభుదాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేఘన తక్షణమే స్పందించి శేరిపల్లి గ్రామములో మన్నె కుల సర్వే నిర్వహంచారు.అనంతరం
కుల గణన ప్రకారం తహశీల్దారు ప్రభుదాస్ ఆదేశాల మేరకు ధృవీకరణ పత్రాలను వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమములో మెదక్ జిల్లా మన్నె కుల సంఘం ఉప అధ్యక్షుడు రాయిని భానుప్రసాద్.మండలఅధ్యక్షుడు శివోళ్ల చంద్రం,గ్రామ అద్యక్షుడు జంగర్ల గోవర్ధన్ అలాగే ఇతర ఎస్సీ కులస్థులు పాల్గొన్నారు.









