రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు రావుల సోమయ్య
వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేత
కరకగూడెం, ఆగస్టు 25 (వై7 న్యూస్):
రైతులు పండించే పంటలకు ఎటువంటి షరతులు లేకుండా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్ చేశారు.సోమవారం మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారిపై ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,తప్పుడు హామీలతో గద్దెదిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా రైతుల సమస్యలపై చిత్తశుద్ధి చూపడం లేదు. రైతులు పండించే పంటలకు కావలసిన యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం రైతుల కష్టాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది అని రావుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.తరువాత రైతుల తరపున సమస్యలను వివరిస్తూ వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.









