E-PAPER

పంచాయతీ కార్మికుని సన్మానించిన గ్రామస్తులు

కరకగూడెం, ఆగస్టు 23(Y7 న్యూస్): 40 సంవత్సరాలుగా పంచాయతీ గుమస్తాగా కొనసాగుతున్న గుమ్మడెల్లి క్రిష్ణ తనదైన శైలిలో పంచాయతీ అభివృద్ధి ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తించిన గ్రామస్థులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం పంచాయతీ గుమస్తాగా పనిచేస్తున్న గుమ్మడెల్లి క్రిష్ణ ఇటీవల సీఐటీయూ గౌరవ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. గతంలో కన్నాయిగూడెం పంచాయతీ రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీ గా గుర్తింపు వచ్చింది.గుమస్తా స్థాయి నుంచి అధికారుల వరకు చేసిన పనితీరు అని వారన్నారు.గుమ్మడెల్లి క్రిష్ణ జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూనము అని కన్నాయిగూడెం గ్రామ ప్రజలు తెలిపారు. సన్మానించిన వారిలో కార్యదర్శి శ్రీనాథ్, ఓకే నరేష్, గణేష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News