మణుగూరు, జూలై 1 వై 7 న్యూస్;
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేసిన వైద్యుల సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మందికి జీవనదీపం వెలిగించిన వైద్యుల త్యాగం అతి గొప్పదని కొనియాడారు.
ఈ సందర్భంగా గురజాల గోపి మాట్లాడుతూ,
వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. రోగికి ప్రాణదాతుడిగా నిలిచే వైద్యుణ్ని మన సంస్కృతిలో నారాయణునిగా కొలుస్తాం. అటువంటి వైద్యులకు గౌరవంగా డాక్టర్స్ డే జరుపుకోవడం అభినందనీయమైన విషయం. దేశానికి, సమాజానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి అని పేర్కొన్నారు.
Post Views: 36