భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎన్నికైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షల సందడి నెలకొంది. పార్టీ కార్యకర్తలతోపాటు నేతలు ఆయనకు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రముఖ బీజేపీ నాయకుడు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు లింగంపల్లి రమేష్ రామచంద్ర రావు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా రామచంద్ర రావు నాయకత్వం ఎంతో ప్రభావవంతంగా మారుతుందనే ఆశతో, వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అని రమేష్ తెలిపారు.లింగంపల్లి రమేష్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.









