E-PAPER

జూలై 9 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

భవన నిర్మాణ కార్మిక సంఘాల పిలుపు

బూర్గంపాడు, జూలై 1 వై 7 న్యూస్;
కార్మిక హక్కుల రక్షణ కోసం జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సారపాక బిల్డింగ్ అడ్డా సమీపంలోని గణేశ్ గుడి వద్ద జరిగిన సమావేశంలో గౌరవ సలహాదారు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ — కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లు యజమానులకు అనుకూలంగా ఉండగా, కార్మికులను హక్కుల నుంచి వంచిస్తున్నాయన్నారు.

లేబర్ ఇన్సూరెన్స్ బోర్డును తొలగించి, ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని తెలిపారు. సమ్మెను జయప్రదం చేయడానికి ప్రతి కార్మికుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :