ఏఎస్ఆర్ పౌడేషన్ వ్యవస్థాపక అయ్యల సంతోష్
వై సెవెన్ న్యూస్ 29 బాన్సువాడ
జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన వాగ్మరి బాలరాజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆదివారం ఆయన కుటుంబాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్ మరియు ఫౌండేషన్ నాయకులు పరామర్శించారు. అధైర్యపడవద్దు అని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి తనవంతుగా రూపాయలు ఐదువేలు ఆర్థిక సహాయం అందించారు. ఫౌండేషన్ కార్యక్రమాలు చురుగ్గా ఉండే బాలరాజ్ ఇలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ నాయకులు రోటే సాయిలు, బక్రె అనిల్, కాందేవార్ శ్రీకాంత్, నాగ్ నాథ్ తదితరులు ఉన్నారు.
Post Views: 22