అశ్వాపురం, జూన్ 28 (వై7 న్యూస్):
అశ్వాపురం మండలంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడిని నియంత్రించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలు, బుక్ స్టాల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత విద్యా అవకాశాలు కల్పించాలని, లేకపోతే విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
Post Views: 89









