E-PAPER

విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి ఎం.హేమలత

న్యాయమూర్తి ఓల్డ్ ఏజ్ హోం వృద్ధులను పలకరిస్తూ అమ్మ మీ సమస్యలు ఏమిటి

మీ ఆలనా పాలన బాగా చూసుకుంటున్నారా…

ఏదైనా సమస్య ఉంటే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ను ఆశ్రయించవచ్చు

ఎం.హేమలత
జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్

నర్సాపూర్ జూన్ 28 వై 7 న్యూస్

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ స్థానికంగా ఉన్న విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను న్యాయమూర్తి ఎం. హేమలత, ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.
అనంతరం విజన్ ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్న వృద్ధులతో ప్రత్యక్షంగా కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది, పలువురు వృద్ధులు వారికి పింఛన్ రావట్లేదని పింఛన్ మంజూరు చేయించమని న్యాయమూర్తిని కోరడం జరిగింది,
న్యాయమూర్తి స్పందిస్తూ అర్హులైన వ్యక్తులకు సంబంధిత అధికారుల ద్వారా మాట్లాడి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు, అదేవిధంగా వృద్ధుల పట్ల ప్రేమ అనురాగాలతో మమకారంతో వారిని చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ న్యాయవాది సి.హెచ్. స్వరూప రాణి, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రతినిధి సుధాకర్ రెడ్డి, సిబ్బంది సుజాత, శిరీష, రాజు లీగల్ సర్వీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!