E-PAPER

మణుగూరులో కార్టన్ సెర్చ్ ప్రోగ్రామ్ నక్సల్స్‌కు సహాయం చేస్తే కఠిన చర్యలు

మణుగూరు, జూన్ 28 వై 7 న్యూస్

భద్రతా దృష్ట్యా జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపిఎస్ ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని రేగులగండి గొత్తికోయ గుంపులో పోలీసులు కార్టన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మణుగూరు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి పి. నాగబాబు మాట్లాడుతూ , ఇక్కడి గిరిజన ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నక్సలైట్లకు సహాయం చేయకూడదని నిత్యావసర వస్తువులు, ఆహారం, సమాచారం వంటి సహాయాలు అందించడం వల్ల వారు నక్సల్స్ చేతికి ఇరుక్కొనవచ్చన్నారు. అందువల్ల ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.మణుగూరు పోలీస్‌ శాఖ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల సహకారంతోనే మనం శాంతిని నిలబెట్టగలగాలన్నారు.ఆ ప్రాంతమంతా సుదీర్ఘంగా తనిఖీలు జరిపి, స్థానికులతో చర్చలు జరిపారు.ఈ చర్యలు ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా, నక్సలైట్ల కదలికలపై పహరాగా నిలుస్తాయని అధికారులు తెలిపారు.ఈ కార్టన్ సెర్చ్ ఆపరేషన్లో సీఐ నాగబాబు, స్పెషల్ పార్టీ పోలీసులు, మరియు మరిన్ని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :