కోడి అమరేందర్ యాదవ్, అశ్వాపురం మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు
అశ్వాపురం, జూన్ 28 వై 7 న్యూస్;
చలో పూసుగూడెం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు విజయవంతం చేయాలని అశ్వాపురం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
అశ్వాపురం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ నిరసనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లను పక్క జిల్లాలకు తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.