వై 7 న్యూస్ పలాస
ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం పలాస మండలం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో మహాసభల పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఈశ్వరమ్మ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, గృహహింసలు పెరుగుతున్నప్పటికీ మహిళల రక్షణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత పోరాటం అవసరమని ఆమె పేర్కొన్నారు.
Post Views: 10








