E-PAPER

ASR కాలనీలో 100 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: కౌన్సిలర్ మిండా హరిబాబు

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

మిండా హరిబాబు చొరవతో అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏ.ఎస్.ఆర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

కొత్తగూడెం, మే 13:(రిపోర్టర్ నాగేంద్ర బాబు)
అశ్వరావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులోని ఏ.ఎస్.ఆర్ కాలనీలో గత కొంతకాలంగా ప్రజలు తక్కువ వోల్టేజ్, నాసిరకం విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ సమస్యపై మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్లకు నివేదిక అందజేయగా, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.

విద్యుత్ శాఖ ఏఈ వెంకట్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వెంటనే 100 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మిండా హరిబాబు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తన వార్డులో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మరియు విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో దయాకర్, కరుణ, రాజ్‌కుమార్, మస్తాన్, హుస్సేన్, బాలాజీ, రాంబాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!