E-PAPER

ములుగులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ములుగు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. గురుస్వామి చిట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, కుమారస్వామి, నరేష్, మిథున్, మహేందర్, శ్రావణ్ గార్ల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. భక్తులకు ప్రసాద వితరణ కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ములుగు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News