పలాస మండలంలోని రామకృష్ణపురం గ్రామంలో ఈ రోజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ SI ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నేటి సాయంత్రం ఎస్ ఐ ఆర్. నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి, గ్రామ జంక్షన్ వద్ద గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారీ శక్తి, కొత్త చట్టాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో ముందుగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, అత్యవసర సేవల కోసం 112 కాల్ వినియోగం వంటి అంశాలపై కూడా గ్రామస్తులకు వివరించారు.









