E-PAPER

పలాస కాశీబుగ్గలో సీసీ కెమెరాలపై అవగాహన సమావేశం

ఇటీవల కాశీబుగ్గ GME కాలనీలో ఓ ఇంటిలో జరిగిన దొంగతనం ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి సీసీ కెమెరాల అవసరాన్ని వివరించారు. భద్రత దృష్ట్యా కాలనీలో మొత్తం 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే పలాస–కాశీబుగ్గ పట్టణంలోని అన్ని వీధుల ప్రజలు కూడా ఇదే విధంగా ప్రతి వీధికి 6 నుంచి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని సూచించారు.సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం, దొంగతనాలు లేదా ఇతర నేర ఘటనలు జరిగిన వెంటనే కేసులను వేగంగా డిటెక్ట్ చేయడం సులభమవుతుందని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News