వై 7 న్యూస్ పలాస
వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పాత బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.బస్టాండ్‌లో కూర్చోడానికి తగినంత కుర్చీలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలాగే ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.కాశిబుగ్గ పాత బస్టాండ్‌లో వెంటనే తగినంత కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
Post Views: 5








