E-PAPER

రాంమ్మూర్తి మృతికి ఆదివాసీ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
– విశ్రాంతి జిసిసి ఉద్యోగి వడదెబ్బతో మృతి

– తెలంగాణ ఆదివాసి ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారిగా సేవలు మరువలేనివి

– రాంమ్మూర్తి మృతి కుటుంబాన్నె కాదు ఆదివాసీల్లోను కన్నీళ్లు మిగిల్చింది

కొత్తగూడెం మే 15 వై 7 న్యూస్ తెలుగు:

ఎండల తీవ్రతకు ఆదివాసీ నాయకుడు ఉన్నపలంగా కుప్పకూలి, మృత్యువాత పడ్డ సంఘటన దమ్మపేటలోని అర్బన్ కాలనీలో చోటుచేసుకుంది, ఎంతో చలాకీతనంతో ఉత్సాహంగా అన్ని విభాగాలను ముందుండి నడిపించే, సలహాలు సూచనలు ఇవ్వగలిగే నాయకత్వం ఉన్న ఏకైక వ్యక్తి సోయం రామ్మూర్తి. ప్రభుత్వ కార్యకలాపానులలో గిరిజన సహకార సంఘం నందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట విధినిర్వాహంలో ప్రభుత్వానికి సేవలు అందించిన సందర్భాలు కూడా అనేకంగానే ఉన్నాయి, కాలక్రమేనా ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఉన్నతాధికారులు విశ్రాంతిని ఇచ్చారు,
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత విపరీతంగా ఎండలు ముదరటంతో జిల్లా వ్యాప్తంగా అనేక మరణాలే సంభవించాయి అర్బన్ కాలనీలో స్వగృహంలో కార్యకలాపాల తర్వాత ప్రతిరోజు లాగానే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఉన్నఫలంగా కుప్పకూలిపోవడంతో మొదటిగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు, కొద్దిమేరకు ధైర్యం తెచ్చుకుని స్థానిక వైద్యుల సలహాతో ఖమ్మం తరలించే ప్రయత్నం చేశారు, రహదారిలోని మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు,

పెద్దమనసుతో కళ్ళను దానం చేసిన కుటుంబ సభ్యులు

తన కళ్ళు మట్టిలో కలిసిపోవద్దని మరొకరికి చూపును అందించాలన్న లక్ష్యం తోటి పెద్ద మనసునే చవిచాటారు, మార్గమధ్యంలో మరణించిన మృతు దేహాన్ని ప్రభుత్వ విధి నిర్వహణ కార్యాచరణ పూర్తి చేసుకొని నిబంధన ప్రకారం ఓ ప్రముఖ ఐ డొనేట్ సంస్థకు కళ్లను దానం చేసి మనసున్న మహారాజులుగా కుటుంబ సభ్యులు నిలిచారు,

రాంమ్మూర్తి ఆదర్శం కావాలి ఆదివాసీ నాయకులు

ప్రతి కార్యచరణ పాలకవర్గంలో పాల్గొనడంలో ప్రథమంగా ఉండి ఉత్సాహంగా నడిపించే వ్యక్తులలో ప్రధాన వ్యక్తి అని ఆదివాసీ నాయకులు కొనియాడుతున్నారు, రామ్మూర్తి అకాల మరణం మరువలేనిదని గుర్తింపు ప్రతిభను తెచ్చిన రామ్మూర్తి చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని ఆదివాసి నాయకులు కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!