E-PAPER

నాలుగు వాహనాలకే సీఎం కాన్వాయ్

వై 7 న్యూస్ పలాస (నరసన్నపేట):
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు శనివారం వచ్చిన ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ను కేవలం నాలుగు వాహనాలకే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎస్కార్ట్ వాహనం, సీఎం వాహనం, కేంద్ర-రాష్ట్ర మంత్రుల వాహనాలు మాత్రమే పాల్గొన్నాయి. ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు మరియు ఇతర ముఖ్య నేతలు రెండు బస్సులలో సభ ప్రాంగణానికి చేరుకున్నారు.ఇంధన ఖర్చులను తగ్గించాలనే ప్రధాన పిలుపు మేరకు కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News