E-PAPER

బాన్సువాడ రామాలయంలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

బాన్సువాడ జూన్ 18 వై సెవెన్ న్యూస్;

బాన్సువాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో “సంకల్ప సభ” నిర్వహించబడింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

మీడియాతో మాట్లాడుతూ, నీలం చినరాజులు మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేసినట్లు పేర్కొన్నారు.అయే విధంగా భారత్‌మాల, స్మార్ట్ సిటీలు, రైల్వే, విమాన సేవల విస్తరణ, అంతర్జాతీయ యోగ దినం గుర్తింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, మోదీ పాలన దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చుతోందని అన్నారు.

అలాగే, బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ పట్ల ఉన్న అపోహలు అవాస్తవమని, బీజేపీ కుటుంబ పార్టీ కాదని, సంస్థాగతంగా బలంగా ఉందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:
లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, చిరంజీవి ఉమేష్, రామకృష్ణ, అనిల్, బాలరాజ్, మహేష్, గుడుగుట్ల శ్రీనివాస్, చిదుర సాయిలు, మోహన్ రెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, కొండని గంగారం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News