E-PAPER

పినపాక తోగ్గూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

పినపాక జూన్ 18 వై 7 న్యూస్;

పినపాక మండలం తొగ్గూడెం ప్రాథమిక పాఠశాలలో మాతృ అభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున విద్యార్థులకు నోటుబుక్స్ మరియు ఇతర విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పినపాక ఎస్ఐ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్య ప్రతి ఒక్కరి హక్కు. గ్రామీణ విద్యార్థులు ముందుకు రావాలి. వారి భవిష్యత్తు మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం” అని అన్నారు.మాతృ అభి ఫౌండేషన్ తరఫున నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రశంసించారు. విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News