తూప్రాన్ బిజెపి మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య
తూప్రాన్ జూన్13 వై7 న్యూస్
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు , సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం ల ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ తూప్రాన్ రూరల్ మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు మండల బి.జె.పి నూతన కమిటీని ప్రకటించారు. మండల కమిటీలో మండల ఉపాధ్యక్షులుగా
సీత నరేష్ యాదవ్, శేఖర్ నాయక్,ఉప్పరి నర్సింలు, దాచారం నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శిగా పిట్ల చంద్రశేఖర్ ముదిరాజ్, అంబటి మహేష్, కార్యదర్శులుగా తలారి నాగరాణి, తొంట సతీష్, రాందాస్, చుక్క రాము, పొగాకు శేఖర్ ఎన్నుకున్నారు. అనంతరం పిట్ల పోచయ్య ముదిరాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో
బిజెపి బలపేతం అవుతుందని, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు బిజెపి వైపు చూస్తున్నారని తొందర్లోనే పార్టీ తీర్థం తీసుకుంటారని , గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలో గ్రామస్థాయిలో బిజెపి మరింత ప్రతిష్టాత్మకంగా , బలపేతం అవుతుందని , రాబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో బిజెపి నాయకుల విజయకేతనం ఎగరడం ఖాయమని , ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.









