మొదటి రోజే బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్ఎస్ లో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈఓ
తూప్రాన్ పర్వతి సత్యనారాయణ
తూప్రాన్ జూన్13 వై 7 న్యూస్
తూప్రాన్ మండలంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత ప్రాతభి పూర్ణత ప్రాథమిక, ప్రైవేటు పాఠశాలలు గురువారం వేసవిలో వేసవి సెలవులు పూర్తి చేసుకొని గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణపల్లిలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే తూప్రాన్ ఎంఈఓ పర్వతి సత్యనారాయణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన చేస్తామన్నారు. విద్యార్థుల పట్ల నైపుణ్యత, విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులైన, ఉపాధ్యాయ శిక్షణ పొందిన టీచర్లతో ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, పట్టుదల, కృషి, క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి ప్రధానోపాధ్యాయురాలు నాగలత పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.









