చెరువు నీటి చౌర్యాన్ని అడ్డుకుని పంట పొలాలను కాపాడాలని కాట్రియాల్ గ్రామ రైతుల ఆందోళన…
కాట్రియాల్ మార్చ్ 21 వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కట్రియల్ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి కొందరు మోటార్ పంపు ద్వారా నీటిని తరలిస్తున్నారని తద్వారా చెరువు కింద వేసిన పంటలకు సరిగా నీరు అందడం లేదని పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వేల రూపాయలు ఖర్చుపెట్టి వ్యవసాయం చేసి పంటలు వేశామని ఇప్పుడు నీరు పొలాలు ఎండిపోతున్నాయని కన్నీరు మున్నీరవుతున్న రైతులు, చెరువులో నుండి పదుల సంఖ్యలో మోటర్లు పెట్టి నీటిని తరలించుకుంటున్నారని గ్రామ సెక్రెటరీ ధనలక్ష్మికి చెప్పిన పట్టించుకోవడంలేదని మండల ఇరిగేషన్ ఏఈ సూర్య దగ్గరికి వెళ్ల ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వచ్చి చూసి వెళ్లడం తప్ప ఏమి చేయడం లేదని మోటర్లు తీయించడం లేదని ఏ సూర్య పై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైన మండల సంబందించిన అధికారులు స్పందించాలని లేదంటే రానున్న రోజుల్లో పోలాలు ఎండిపోయి నష్టపోతమని పొలాలతో పాటు, పశువులకు తాగడానికి నీరు కూడా దొరకదాని తద్వారా నీటి కొరత ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించలని లేని యెడల ఈ విషయం కలెక్టర్ ద్రుష్టికి తీసుకు వెళ్తామని గ్రామ రైతులు ఏఈ సూర్య పై అగ్రహాo వ్యక్తo చేశారు.









