హైదరాబాద్, మార్చి 21 వై 7 న్యూస్;
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ రోజు హైదరాబాద్‌లో సింగరేణి C&MD బలరాం నాయక్‌ను కలసి పలు సమస్యలపై చర్చించారు. మణుగూరులో సుమారు 250 కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్స్ తమ జీవనాధారంగా బొగ్గు లోడింగ్‌పై ఆధారపడుతున్నారని, ఈ లారీ ఓనర్లతో పాటు అందులో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలను కలిపి దాదాపు 5,000 మంది జీవితాలు దీనిపై ఆధారపడ్డాయని,ఈ నేపథ్యంలో బొగ్గు లోడింగ్‌ను కేటాయించి ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
అలాగే సింగరేణి సంస్థ ద్వారా రూ. 5 కోట్లు CSR నిధులను మణుగూరులో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ప్రతిపాదనలు అందజేస్తే తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
వివిధ కంపెనీలకు సంబంధించిన కోల్ పర్మిట్లను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
మణుగూరులోని కట్టవాగు, కోడిపుంజుల వాగు, మోట్ల వాగు చెరువులతో పాటు సింగారం చెరువులోని షీల్డ్‌ను వచ్చే మే నాటికి పూర్తిగా తీయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా, ఈ విషయమై మణుగూరు జీఎంకు సమాచారం అందించి అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తామని సీఎండీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పొలమూరి రాజు,లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ M. బాల సత్యనారాయణ,సెక్రెటరీ సురేందర్ రెడ్డి,గోవింద్ ,నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.









