E-PAPER

మానసిక వ్యక్తులకు నిరుపేదలకు వికలాంగులకు అండగా ఎన్ హెచ్ ఆర్ డబ్ల్యు పి సి

మిషనరీ ఆప్ శాంతినికేతన్ ఆశ్రమాన్ని సందర్శించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ సతీష్ కుమార్.

ఖమ్మం,జనవరి 26 వై సెవెన్ న్యూస్;

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఇల్లందు రోడ్ లో గల మిషనరీ ఆప్ శాంతినికేతన్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడున్నటువంటి వికలాంగులకు మానసిక వ్యక్తులకు భోజన సౌకర్యం ఆశ్రమానికి సంబంధించిన ఇన్చార్జికి పది వేల రూపాయలు అందజేసారు. అనంతరం ఆశ్రమానికి సంబంధించిన లోటుపాట్లు కనుక్కొని వారికి అన్ని విధాల ఆదుకుంటామని ఉమ్మడి కమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ సతీష్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. వారు మాట్లాడుతూ వికలాంగులకు మానసిక వ్యక్తులకు నిరుపేదలకు ఒక పూట భోజనం పెడితే 100 గోవులకు దానం చేసి అంత పుణ్యం వస్తుందని వారికి చేసే ప్రతి రూపాయి కూడా దేవుడికి కానుకి ఇచ్చినంత విలువతో కూడుకున్నదని వారికి చేసే సేవలో మనం చేసిన ఎటువంటి పాపములు ఉన్నా గాని వీరికి సేవ చేయడం వల్ల మన పాపములన్ని కూడా తుడిచిపెట్టుకు పోతాయని మానవసేవే మాధవసేవ అన్నట్టు వీరికి సేవ చేసినచో దేవుడికి పూజ చేసి దీపారాధన చేసి దేవుడిని మనం ఎలా మొక్కుతామో ఆ దేవుడు అనుగ్రహం ఎలా ఇస్తారో వీరికి మనం సేవ చేసినా గాని దేవుడి అనుగ్రహం తప్పకుండా మనకు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీరామ్ సతీష్ కుమార్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్