– రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇది
– పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ
. బీరోలు సొసైటీ చైర్మన్ గ్రామ సహాయం నరేష్ రెడ్డి
తిరుమలాయపాలెం జనవరి 26 ( వై సెవెన్ న్యూస్ )
: ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారని…. 2025 జనవరి 26 రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే రోజు అని… ఈ రోజునే తెలంగాణ యావత్తు మెచ్చేలా ప్రతిష్టాత్మకమైన నాలుగు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభిస్తోందని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ బీరోలు సొసైటీ చైర్మన్ రామ సహాయం నరేష్ రెడ్డి పేర్కొన్నారు
ఆదివారం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఏలు వారి గూడెం గ్రామసభలో వారు మాట్లాడుతూ…. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అనే నాలుగు పథకాలను ప్రారంభించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు దక్కేలా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేకాధికారులను కూడా నియమించడం జరిగిందన్నారు. జాబితాలో పేర్లు రాని వారిని ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ఉసిగొల్పె ప్రయత్నం చేస్తున్నాయని వారి మాటలు నమ్మి ఆందోళనలకు గురికావద్దని ప్రజలకు సూచించారు. మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఏలు వారి గూడెం ఇందిరమ్మ ఇండ్లు 50 రైతు భరోసా క్రింద 208 తెల్లని రేషన్ కార్డులు 18 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 22 మంది కి మంజూరు కాగా వారికి మంజూరైన సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమం లో మద్దులపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి తిరుమలాయపాలెం మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తహసిల్దార్ పీవీ రామకృష్ణ ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ ఎంపీ ఓ సూర్యనారాయణ ఏపీవో నరసింహారావు ఏవో నా రెడ్డి సీతారాం రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి స్నేహలత మాజీ ఎంపీపీ లు కొప్పుల అశోక్ బోడ మంగీలాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ పోట్ల కిరణ్ షేక్ సైఫుద్దీన్ ఉన్నం రాజశేఖర్ పత్తి నాగేశ్వరరావు తాటికొండ కిరణ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లంజపల్లి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ గుగ్గిళ్ళ అంబేద్కర్ సిరి గద్దె ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు