క్యాలెండర్ ఆవిష్కరణ లో పాల్గొన్న సెంట్రల్ కేమిటి ట్రెజరర్ గుగులోత్ దశరథ్ ఈ పి ఆపరేటర్ మరియు జగన్ నాయక్
మణుగూరు,జనవరి18(వై 7న్యూస్)
సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రావు , వర్కింగ్ ప్రెసిడెంట్ పంతుల ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నందు, సి ఎం డి బలరాం ,సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి , డైరెక్టర్ సత్యనారాయణ, జి ఎం సుభాని చేతుల మీదగా వైభవంగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
నేషనల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ని హైదరాబాదులోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను వారి చేతుల మీద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కమిషన్ మెంబర్ జాటొత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణిలో ఎస్టి గిరిజన ఉద్యోగుల ప్రతి ఒక్క ఉద్యోగి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గిరిజన లీడర్లకు మరియు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్లాగ్ 665, పోస్ట్లు మరియు పిడిఎఫ్ 350 పోస్టులు 1000 బ్యాక్ లాక్ పోస్టుల గురించి మీరందరూ అనేకమార్లు కలిసి రిప్రజెంటేషన్ చేయడం మూలంగా గవర్నమెంట్ తోను మరియు సింగరేణి మాజీ
సి ఎం డి శ్రీధర్ తో మాట్లాడి భర్తీ చేయించడం జరిగిందని తెలియజేశారు, అలాగే రాబోయే రోజుల్లో కూడా గిరిజన ఉద్యోగులకు మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే గిరిజనులకు న్యాయపరంగా రావలసిన అన్ని హక్కులను వారికి ఇప్పించి వారందరికీ న్యాయం చేస్తానని తెలియజేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి లో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి అని అలాగే సంస్థ నిర్ణవించిన లక్ష్యం ని సాధించడంలో ప్రతి ఒక్క ఉద్యోగి సేఫ్టీ తో పని చేయాలి అని అన్నారు. భవిష్యత్ లో సింగరేణి విద్యుత్ రంగంలో సైతం మరింత లాభాలతో ముందుకు వెళ్తుంది అని అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమే సంస్థ కి ముఖ్యం అని కార్మికుల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకోసం సంస్థ అన్ని వెళ్లాలో ముందు ఉంటుంది అని అన్నారు. ఎస్ టీ అసోసియేషన్ ఉద్యోగుల సమస్య పరిష్కారం చేయడం తో పాటు, సింగరేణిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, మరియు సింగరేణి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన యువతకు నూతనంగా ఉద్యోగాలు కల్పించడంలో సింగరేణి సంస్థ నెంబర్ వన్ గా నిలిచిందని తెలియజేశారు, అలాగే సింగరేణిలో ఎస్టి బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీకి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కూడా ఎనలేని కృషిని చేశారని అలాగే సింగరేణి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సేవ కార్యక్రమంలో ముందు ఉండాలి అని అన్నారు.గిరిజన ఉద్యోగులకి ఎలాంటి సమస్య ఉన్న మా వద్దకు సమస్యను తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని డైరెక్టర్లు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాల్లో సెంట్రల్ కమిటీ మరియు ఏరియా కమిటీ ఉద్యోగస్తులు, ఏరియా లైసనింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
మణుగూరు ఏరియా నుండి గూగులోతు దశరథ్ ట్రెజరర్ సెంట్రల్ కమిటీ , బి. జగన్ నాయక్ . పాల్గొన్నారు.అలాగే వివిధ ఏరియాల నుండి గిరిజన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.