E-PAPER

రోడ్డు ప్రమాదంలో సిపిఎం నేత రేపాకుల వెంకన్న మృతి

తిరుమలాయపాలెం జనవరి 18 y7న్యూస్

రోడ్డు ప్రమాదంలో సిపిఎం నేత మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామపంచాయతీ శివారు పాపాయి గూడెం గ్రామానికి చెందిన సిపిఎం మండల కమిటీ సభ్యులు రేపాకుల వెంకన్న 54 సంవత్సరాలు శనివారం ఉదయం తన స్వ గ్రామమైన పాపాయి గూడెం తన ఇంటి నుండి రఘునాధపాలెం మండలం వి.వి పాలెం తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి తన మోటార్ సైకిల్ పై పాపాయి గూడెం బయలుదేరి వస్తుండగా ఖమ్మం ఈనాడు ఆఫీస్ సమీపంలో వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ తన మోటార్ సైకిల్ ను బలంగా ఢీకొట్టడంతో రేపాకుల వెంకన్న కు బలమైన గాయాలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు వెంటనే పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు వెంకన్న మృతి వార్త తెలుసుకున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్ సిపిఎం పాలే డివిజన్ కార్యదర్శి బండి రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు యర్ర శ్రీనివాసరావు సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను తిరుమలాయపాలెం సొసైటీ డైరెక్టర్ చల్లా వెంకటేశ్వర్లు మండల నాయకులు పప్పుల ప్రసాద్ పద్మనాబుల సుధాకర్ అంగిరేకుల నరసయ్య పిండిప్రోలు సిపిఎం శాఖ కార్యదర్శి దొడ్డ లింగస్వామి ఎడ్ల ముత్తయ్య పాపాయిగూడెం శాఖ కార్యదర్శి జాల ఉమేష్ పప్పుల ఉపేందర్ నాగటి సురేష్ దొండేటి నిర్మల్ రావు కొలిచలం స్వామి రామన బోయిన రవి చామకూరి వీరయ్య పిట్టల పాపారావు సొంటి వెంకటేశ్వర్లు గుంటి వీరన్న ఉప్పల గోపాలకృష్ణయ్య గుంటి ఉపేందర్ జాల చింటూ రేపాకుల రాధాకృష్ణ మిర్యాల రామారావు పిడియాల లక్ష్మీనారాయణ జాల కన్నయ్య పీడియాల ఉపేందర్ తదితరులు వెంకన్న పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్