E-PAPER

బహుజన్ సమాజ్ పార్టీలో 10 కుటుంబాలు చేరిక

బహుజన వాద రాజకీయాలు మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ది చేయగలవు

తడికల శివకుమార్( జిల్లా ఇన్ చార్జ్)

చర్ల,జనవరి20 వై 7 న్యూస్ తెలుగు

బహుజన్ వాద రాజకీయాలు మాత్రమే ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ది చెందించగలవని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్ అన్నారు. సోమవారం బిఎస్పీ చర్ల మండల కమిటీ ఆద్వర్యంలో పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహణ సందర్భంగా ఈ వ్యాఖ్య లు చేశారు.చర్ల మండల ప్రదాన కార్యదర్శి కొండా కౌషిక్ ఆద్వర్యంలో చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందినా పది కుటుంబాలు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు నెరవేర్చడానికి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి ఆద్వర్యంలో కృషిచేస్తోందని,బహుజనులకు జనాభా ప్రాతిపదికన విధ్యా,ఉద్యోగ,ఉపాది,రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు రాజకీయ అధికారం అవసరం అవుతుందని,అందుకు ఎస్సీ, బిసి,ఎస్టీ,మత మైనారిటీ వర్గాలు ఐక్యంగా బిఎస్పీ ని రాజకీయంగా బలపర్చేందుకు పార్టీ లోకి రావాలని ఆహ్వానించారు.బహుజనులు రాజకీయ అధికారం లో వాటా పొందితేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ తదితర బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News