E-PAPER

అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమములో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

కారేపల్లి,డిసెంబర్ 20 వై 7 న్యూస్;

కారేపల్లి మండలం గిద్దవారిగూడెంలో ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం మండ్రు పుల్లయ్య గురుస్వామి, కేలోత్ రవి గురు స్వామి ల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పాల్గొని స్వాములందరకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నలభై రోజులు కఠినదీక్షతో ఏకభుక్తo తో, కటిక నేలపై పడుకుని, పాదరక్షలు లేకుండా తమ వృత్తి ధర్మాన్ని మరువకుండా ఉండి శబరిమలై యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా అందరికీ, అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డేగల ఉపేందర్, బొబ్బలు ఉపేందర్,గోపికృష్ణ గురు స్వామి, డేగల కృష్ణ గడ్డమీది లింగయ్య, కన్నబోయిన ఉపేందర్ రామారావు శేఖర్ వెంకటేష్, రాము నవీన్ వినోద్ రాజేష్ గణేష్ లోకేష్ ఆదినారాయణ నవీన్ కృష్ణమూర్తి నగేష్ రాము మరియు అయ్యప్ప స్వాముల బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News