దర్యాప్తు చేస్తున్న వర్ని మండల పోలీసులు
వర్ని డిసెంబర్ 20వై, 7న్యూస్ తెలుగు
వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడు గత వారం రోజుల నుండి బడా పహాడ్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని అతను చలి తీవ్రత వల్ల లేదా ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయంపై దర్గా సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ధరకాస్తు ఆధారంగా వర్ని మండల ఎస్సై జి.రమేష్ కేసు నమోదు చేసుకొని మృతుడి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.వృద్ధుడి మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి మార్చురిలో భద్రపరచబడి ఉంచినట్లు తెలిపారు, మృతునికి సంబంధిత అనవాళ్లను గుర్తించిన వారు వర్ని మండల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.