బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు
వార్డెన్ వేరే హాస్టల్ కు బదిలీ తో చేతులు దులుపుకున్న అధికారులు.
బాన్సువాడ డిసెంబర్ 20 వై సెవెన్ న్యూస్ తెలుగు
ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ప్రతిపక్షాలు గురుకుల పాఠశాలల బాట పట్టినప్పటికీ , వసతి నిర్వాకుల అవినీతి వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ఉడికి ఉడకని ,అన్నం నీళ్ల చారు, అందించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం కేవలం సస్పెండ్, బదిలీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఫలితం విద్యార్థులకు శాతంగా మారుతుంది. తాజాగా కామారెడ్డి జిల్లాపెద్దకొడప్‌గల్ ఎస్టి బాలుర వసతి గృహంలో ఉడికి ఉడకని అన్నం పెట్టడం వల్ల అది తిని నలుగురు విద్యార్థులు గురువారం రాత్రి అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వార్డెన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు వార్డెన్ వేరే హాస్టల్ బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. వివరాలు కి వెళ్తే. పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలోని ఎస్టి బాలుర వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే. హాస్టల్‌లో గురువారం రాత్రి భోజనం తర్వాత 8వ తరగతి విద్యార్థులు బహదుర్‌సింగ్, జగన్‌కు తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీంతో వారిద్దరిని అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్టల్‌లో ఉడకని అన్నం తినడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఎస్టి బాలుర హాస్టల్‌లో ప్రస్తుతం 98 మంది విద్యార్థులు ఉంటున్నారు. గురువారం ఉదయం ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు తినకుండానే స్కూల్‌కు వెళ్లిపోయారు. తిరిగి రాత్రి కూడా ఉడకని అన్నం పెట్టినట్లు తెలుస్తోంది. రోజు కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో కూరలు వండట్లేదని దీంతో సగం ఆకలితో గిరిజన పుత్రులు అలమాటిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము వసతి గృహాల్లో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలు నెలకు ఖర్చు చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇదేనా విద్యార్థులకు అందించే లక్ష రూపాయల భోజనం అంటూ విద్యార్థుల సంఘాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. ఒక సంఘటన జరగగానే ప్రభుత్వం అధికారులు హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటారు. దీనివల్ల తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు వస్తుందని వసతి గృహాల్లో గురుకులలో కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలబాలిలకు నాణ్యమైన ఆహారం అందక రక్తంహిత బారిన
పడుతున్నారు. అనారోగ్యం బారిన పడి విద్యార్థులు విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్న బాలబాలికలకు నాణ్యమైన విద్య అందడమే కాకుండా పౌష్టికాహారము అందే అవకాశాలు ఉన్నాయి.