డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు
మణుగూరు డిసెంబర్ 20 వై 7 న్యూస్;
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున కార్గే,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి నిరసన తెలియజేసిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినకి నవీన్ మణుగూరు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో ఎమ్మెల్యే పాయం ఆదేశాల మేరకు పిరినాకి నవీన్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త లతో ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు నవీన్ మాట్లాడుతూ డా,,బి.ఆర్.అంబేద్కర్ అంటే గౌరవం లేదు విలువలేదు రాజ్యసభలో అంబేద్కర్ను చిన్నచూపు చూడడం సిగ్గుచేటు రాజ్యాంగంపై ప్రమాణం చేసే కేంద్ర మంత్రిగా ఈనాడు మీరు చలామణి అవుతున్నారు అది మరిచి ఒక దళిత వర్గానికి చెందిన మేధావిని అవమానకరంగా రాజ్యసభలో మాట్లాడటం అనేది తగదని వెంటనే భారత ప్రజలకు క్షమాపణ చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండ్ గా నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నామని రాజ్యసభలో *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్* గారిని అవమాన పరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే మీ పార్టీకి మీకు మీ మంత్రి వర్గానికి దళితులు అంటే ఎంత చిన్నచూపో అర్థం అవుతుంది అని కానీ ఈనాడు *అంబేద్కర్* అంటే ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారత దేశ ప్రజల ఆకాంక్ష ఆరాధ్య దైవం అని మీరు గుర్తు చేసుకోవాలి అని ఈనాడు భారతదేశంలో *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్* గారిని దేవుడు లాగా అందరూ ఆరాధిస్తారు అని , పరిపాలనను పక్కకు పెట్టి కాలయాపన చేస్తున్నారు అని
ఇండియా కూటమి సభ్యులు సభలో *అంబేద్కర్* గారి గురించి మాట్లాడితే అది తప్పుగా భావించి ప్రతిపక్షాలను నీరుగార్చే విధంగా అవమానపరచటం సభను తప్పుదోవ పట్టించడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసి దేశ ప్రజలను అవమానిస్తున్నారు అని
11 ఏళ్ల మీ పరిపాలనలో దేశానికి ఏ ఒక్క మంచి పని చేయకపోగా రాజ్యాంగాన్ని నిర్వేర్యం చేయడం కోసం రాజ్యాంగాన్ని రూపుమాపటం కోసం మీరు పడుతున్న తపన దాన్ని ఖండిస్తున్న ప్రతిపక్ష నాయకులపై మీ అక్కసు బయటపడుతుంది అని సభ సజావుగా జరిగితే మీరు తీసుకొచ్చే తప్పుడు బిల్లులన్నీ పాస్ చేసుకోవడం కోసం సభను తప్పుదోవ పట్టించే విధంగా దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాజ్యసభల అవమానపరచడం ఇది దేశానికే ఒక చీకటి రోజుగా భావిస్తున్నామని తెలియజేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమల్లో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు, మణుగూరు టౌన్ అధ్యక్షులు శివ సైదులు,నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి,మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య,యూత్ మండల అధ్యక్షులు సతీష్ కూచిపూడి బాబు,సామ శ్రీనివాస్ రెడ్డి,గాండ్ల సురేష్, కనకలక్ష్మి,కనకయ్య,రాములు,వెంకట్రావు గౌడ్, రవీందర్ రెడ్డి, సీతయ్య, మధుకుమార్ రహీమ్ పాషా,కృష్ణ,అప్పారావు నాగేశ్వరరావు,
సంబశివారావు, కృష్ణవేణి రవి,శ్యామల,దేవి, పద్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు