E-PAPER

అంబేద్కర్ పై హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బాన్సువాడలో కాంగ్రెస్ ధర్నా 

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం 

బాన్సువాడ డిసెంబర్ 20 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ పట్టణంలోని
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అంబేద్కర్ పై అనిత వ్యాఖ్యలు చేసిన హోం శాఖ మంత్రి తన మంత్రికి పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి గణేష్  మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవహేళన చేసి మాట్లాడడం హాస్యాస్పదమని, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా ఉందంటూ ఆయన వెల్లడించారు. అని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి రుణపడి ఉన్నాడు, అని వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ ఈ విషయమై వెంటనే స్పందించి అమిత్ షా ని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి,  మంత్రి గణేష్, మత్స్యశాఖ జిల్లా చైర్మన్ గులసత్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, కౌన్సిలర్ బాడీ శీను, లాయక్,  అక్బర్ అంబర్ సింగ్ రహీమ్,షౌకత్ భాయ్ కాంగ్రెస్ నాయకుడు నసీమోద్దీన్  ,నరేష్ రాథోడ్ ఖాదర్, జుబేర్,ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :