E-PAPER

కాంట్రాక్టు కార్మికులపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సిఐటియు పిలుపు

దూలం శ్రీనివాస్ ఎస్ సి కే ఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

మంచిర్యాల,డిసెంబర్13 వై 7 న్యూస్;

సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో, కాంట్రాక్టు కార్మికులను గుర్తించడంలో, కార్మికులకు రావలసిన హక్కులను అమలు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వివక్షను సైతం చూపిస్తుంది. ఈ వివక్షకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న సింగరేణి డే సందర్భంగా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో పనిచేస్తున్న కన్వెయన్స్ డ్రైవర్ల సమావేశంలో దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం 2022 సెప్టెంబర్ లో జరిగిన అగ్రిమెంటులోని అంశాలను అమలు చేయడంలో సంవత్సరాలు గడుస్తున్న నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం నినాదం చేసిన దాన్ని అమలు చేయడంలో, అందులో పని చేసే కాంటాక్ట్ కార్మికులను గుర్తించడంలో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుంది. దీని మూలంగా ఉత్పత్తి లక్ష్యంలో గమ్యాన్ని చేరడానికి, సంస్థ లాభాల బాట నడవడానికి కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఉపయోగించుకుంటూ ఆ సంస్థలో కుటుంబంగా గుర్తించడంలో మాత్రం కాంటాక్ట్ కార్మికులను వివక్ష చూపిస్తుంది. డిసెంబర్ 23 సింగరేణి డే ఉత్సవాల లోపు కాంటాక్ట్ కార్మికులకు చేసిన అగ్రిమెంట్ లోని అంశాలను అమలు చేయాలి. అలాగే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు సైతం పెంచే విధంగా ముందుకు రావాలి. అలాగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐ ఎన్ టి సి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సైతం కాంట్రాక్టు కార్మికుల విషయంలో బయటికి అన్ని మేమే చేస్తున్నామని గొప్పలు చెప్తున్నా సమస్యలు పరిష్కారం అయ్యే స్ట్రక్చరల్ మీటింగ్లో మాత్రం ఆ విషయాల్ని ప్రస్తావించకుండా కార్మికులను మోసం చేస్తున్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఈరోజు అన్ని విభాగాలలో అతి తక్కువ వేతనాలతో, ఎక్కువ శ్రమను చేస్తున్నారు. వీరి శ్రమను గుర్తించి సింగరేణి యాజమాన్యం అగ్రిమెంటులోని అంశాలను అమలు చేయాలి. లేనియెడల డిసెంబర్ 23న జరిగే సింగరేణి డే రోజు పెద్ద ఎత్తున కాంటాక్ట్ కార్మికులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కన్వియన్స్ డ్రైవర్ యూనియన్ ఫిట్ కమిటీ అధ్యక్షులు కాసిపేట రాజేశం, కోశాధికారి కలవేణి సతీష్, తోకల రాజు కుమార్, సల్లూరి సురేష్, కుమార్, వినయ్, మల్లేష్, వెంకటేష్, శశిధర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్