E-PAPER

సింగరేణి కుటుంబాల చిన్నారులకు వెల్ బేబీషో పోటీలు

మణుగూరు,డిసెంబర్13 వై 7 న్యూస్;

డిసెంబర్ నెల 23వ తేదీన పివి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు ఘనంగా నిర్వహించబడునున్న సింగరేణి దినోత్సవ వేడుకలలో భాగంగా మణుగూరు ఏరియాలో వివిద గనులు, డిపార్ట్ మెంట్ ల యందు పని చేస్తున్న సింగరేణి ఉద్యోగుల చిన్నారులకు తేదీ. 18.12.2024న ఉదయం 10.00 గంటల నుండి సింగరేణి ఏరియా హాస్పిటల్, మణుగూరు నందు వెల్ బేబీషో నిర్వహించబడును.ఈ వెల్ బేబీషో లో పాల్గొనుటకు ఈ క్రింది నిబంధనలు విధించడమైనది.ఉద్యోగుల పిల్లలు వయసు 1 సం|| నుండి 5 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.పేరెంట్స్ పోటీలో పాల్గొనే పిల్లలతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు ఇమ్యునైజేషన్ వివరాలను తీసుకురావాలి.
ఉద్యోగి యొక్క తమ సింగరేణి ఐడెంటిటీ కార్డ్ ను వెంట తీసుకొని రావాలి.ఈ అవకాశాన్ని మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులందరు సద్వినియోగ పర్చుకోవలసినదిగా అధికార ప్రతినిధి & డిజిఎం (పర్సనల్) ఎస్ రమేష్ తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్