టెండర్ మారిందనే నేపంతో విధుల నుంచి తొలగింపు దుర్మార్గం
దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
మంచిర్యాల,డిసెంబర్13 వై 7 న్యూస్;
మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ పరిధిలోని ఏరియా వర్క్ షాప్ లో డివైస్ సి వెహికల్ పై కన్వియన్స్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నా సంతోష్ అనే కాంటాక్ట్ కన్వెయన్స్ డ్రైవర్ ని అకారణంగా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టెండర్ మారిందనే నేపంతో విధుల నుండి తీసివేయడం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు.వారు మాట్లాడుతూ,గత ఆరు సంవత్సరాలుగా ఎంతో నమ్మకంతో, నిబద్ధతతో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు.అధికారి వెహికల్ టెండర్ గడువునవంబర్ నెల 30 తో ముగిసింది. కొత్త టెండర్ డిసెంబరు ఒకటి నుండి ప్రారంభం కాగా, నేనే ఈ వెహికిల్ ఓనర్ ని కాబట్టి నేనే నడుపుకుంటానంటూ ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న సంతోష్ అనే డ్రైవర్ ని నిర్ధాక్షణంగా విధులనుండి తొలగించడం జరిగిందని, అధికారులు స్పందించి తొలగించిన కన్వియన్స్ డ్రైవర్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో మందమర్రి డివిజన్ వ్యాప్తంగా కార్మికునికి మద్దతుగా నిరసన, ఆందోళన పోరాటాలు సైతం చేస్తామని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు నాయకులు హెచ్చరించారు.