అశ్వాపురం డిసెంబర్,12వై సెవెన్ న్యూస్ తెలుగు,
అశ్వాపురం:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఎంపీడీవో గంట వరప్రసాద్ ,పంచాయతీ సెక్రెటరీ దాసరి మల్లేశం , అశ్వాపురం పంచాయతీలోని చిన్న తండా గ్రామం నందు ఇందిరమ్మ ఇండ్లు ఇంటింటి సర్వేని ప్రారంభించారు.ఈ సర్వేలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆధారాలు సేకరించి యాప్ లో పొందుపరచడం జరిగింది.ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల సమాచారాన్ని సేకరించి వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, ఈ సర్వే కోసం ప్రతి 500కు ఒక సర్వేయర్ని నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఈ సర్వేయర్లు ప్రజల నుండి సమాచారాన్ని స్వీకరించి అవసరమైన వివరాలను ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ సర్వే డిసెంబర్ నెల ఆఖరి లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు గొల్లపల్లి నరేష్ కుమార్, కోలా శశికాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ జర్పుల లక్ష్మణ్, పంచాయతీ సిబ్బంది గద్దల శివకృష్ణ, నల్లగట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.









