ఆర్ ఓ ప్లాంట్ టెండర్ పిలిచి పాత కాంట్రాక్టు కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలి
దూలం శ్రీనివాస్ ,సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు.
శ్రీరాంపూర్,డిసెంబర్12 వై 7 న్యూస్;
శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ వో వాటర్ ప్లాంట్ టెండర్ పిలిచి పాత కార్మికుల్ని కొనసాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ… శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలో పర్మనెంట్ కార్మికులకు, అధికారులకు శుద్ధమైన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో కృష్ణకాలనీ, నస్పూర్ ఏరియాలల్లో మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వాటర్ సప్లై గా పనిచేయడానికి టెండర్ ద్వారా కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడం జరిగింది. అయితే ఆ టెండర్ గడువు ముగిసి 7 నెలలు అవుతున్న, ఇప్పటివరకు కొత్త టెండర్ పిలవకుండా ఆ పాత కార్మికులకు పని కల్పించకపోగా, సివిల్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్ట్ కార్మికులను తీసుకువచ్చి పనిచేయడం దుర్మార్గమైన చర్య అని,తోటి కార్మికుల పొట్టలు కొడుతూ, వారు చేయాల్సిన పనిని కాకుండా వేరే సెక్షన్ నుండి తీసుకువచ్చి, సివిల్ కార్మికులతో పనిచేయిస్తున్న సివిల్ అధికారులు. సివిల్ కార్మికులతో ఆర్వో ప్లాంట్ లో పని చేయించేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇలాంటి చర్యలు చేస్తున్న కూడా సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. వెంటనే ఏరియా సివిల్ డివై జి యం స్పందించి ఆర్వో ప్లాంట్ టెండర్ను పిలిచి పాత కార్మికులతోనే విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి,నిబంధనలకు విరుద్ధంగా సివిల్ కార్మికులతో పనిచేస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకొని ఆర్వో ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తగిన న్యాయం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. లేనియెడల ఆ కార్మికులతో ఆందోళన, పోరాటాలకు సైతం సిద్ధమైతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి కాసీపేట రాజేశం, సురేష్, రాజు, వెంకటేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.